22 June 2015

బాబు జమానాలో రైతులకు రుణాల బాధలు!

రైతులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అనేక కల్లబొల్లి కబుర్లతో రైతులను మోసపుచ్చిన చంద్రబాబు చివరకు వారికి బ్యాంకుల నుంచి రుణాలు పుట్టని పరిస్థితి తీసుకువచ్చాడు. రుణాలు అందకుండా పోయి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చంద్రబాబు హయాంలో షరా మామూలే. గత తొమ్మిదేళ్ల నరకం ఇపుడు పునరావృతమౌతోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల లక్ష్యాలు...వాస్తవంగా ఇచ్చిన రుణాలు....అలాగే వ్యవసాయ టర్మ్ రుణాలు లక్ష్యాలు..వాస్తవంగా ఇచ్చిన రుణాలు...ఖరీఫ్, రబీ సీజన్‌ల వారీగా ఈ విధంగా ఉన్నాయి. ఈ వివరాలు చూస్తే చంద్రబాబు జమానాలో రైతుల కష్టాలు ఎలా ఉన్నాయో అర్ధమౌతుంది.
 -మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలో కలిపి వ్యవసాయ పంట రుణాల లక్ష్యం 41,978 కోట్ల రూపాయలకు గాను 29,551 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు. ఖరీఫ్, రబీలో కలిపి వ్యవసాయ టర్మ్ రుణాలు 14,041 కోట్ల రూపాయల లక్ష్యానికి గాను 10,950 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు.
 -మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలో పంట, వ్యవసాయ టర్మ్ రుణాల లక్ష్యం 56,019 కోట్ల రూపాయలకు గాను వాస్తవంగా ఇచ్చిన రుణాలు 40,501 కోట్ల రూపాయలు.
 - గత పదేళ్ళలో ఏ సంవత్సరాన్ని తీసుకున్నా బ్యాంకులు ముందుగా ప్రకటించిన వ్యవసాయ రుణాల లక్ష్యం కంటే వాస్తవంగా ఇచ్చిన వ్యవసాయ రుణాలు ఎక్కువగా ఉంటాయి.
 ఉదాహరణకు 2011-12లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 48 వేల కోట్లు అయితే... వాస్తవంగా ఇచ్చింది 58,511 కోట్లు.
 2012-13లో లక్ష్యం రూ. 52,972 కోట్లు అయితే ఇచ్చింది రూ. 73,648 కోట్లు
 2013-14లో లక్ష్యం రూ. 67,224 కోట్లు అయితే ఇచ్చింది రూ. 73,494 కోట్లు
 2014-15లో లక్ష్యం 56,019 కోట్ల రూపాయలకు గాను వాస్తవంగా ఇచ్చిన రుణాలు 40,501 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 15,500 కోట్ల రూపాయలు తక్కువ ఇచ్చారు. ఇదీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘనత. ఇదీ రైతులకు ఆయనపై ఉన్న ప్రేమ.

No comments:

Post a Comment