27 June 2015

29 నుంచి షర్మిల పరామర్శ యాత్ర

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర సోమవారం ప్రారంభం అవుతోంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో దిగాలు చెంది వందల మంది అకాల మృత్యువుకు లోనయ్యారు. వీరిని పరామర్శించటం తన బాధ్యతగా వైఎస్ జగన్ భావించారు. అదే మాటను ప్రకటించి ఆచరణలో చూపారు.

  వైఎస్‌జగన్ ఇచ్చిన మాట మేరకు తెలంగాణ జిల్లాల్లో ఆయన సోద రి వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో వైఎస్ జగన్ పరామర్శ యాత్ర పూర్తి చేశారు. తర్వాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో వైఎస్ షర్మిల రెండు విడతలుగా పరామర్శ యాత్ర చేశారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఆమె పర్యటించనున్నారు.

  సోమవారం ఉదయం వైఎస్ షర్మిల పర్యటన శంషాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. బెంగళూరు నుంచి విమానంలో శంషాబాద్ చేరుకొన్న షర్మిలకు పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతాయి. తర్వాత సరూర్‌నగర్ మండలం జిల్లెల గూడ చౌరస్తాలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి యాత్ర ను ప్రారంభిస్తారు. తర్వాత అదే మండలంలోని కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ కు దగ్గరలోని మంద మల్లెమ్మ చౌరస్తాలో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతారు. తర్వాత ఆమె పర్యటన రంగారెడ్డి జిల్లాలోని మిగిలిన నియోజక వర్గాల్లో సాగుతుంది. జూలై  ఒకటో తేదీన షర్మిల చేవెళ్ల చేరుకొంటారు. అక్కడ ఆ రోజు ఉదయం 11గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

  మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా చేవె ళ్ల నుంచి ప్రారంభించే వారు. ఏ కార్యక్రమంలో అయినా చేవెళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. దాదాపు 100 కు పైగా కార్యక్రమాలు చేవెళ్ల నుంచి ప్రారంభించి విజయవంతం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ప్రజల గుండెల్లో వైఎస్సార్ కొలువై ఉన్నాడు. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తర్వాత రెండో తేదీన ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో పర్యటించిన తర్వాత ఈ దశ పరామర్శ యాత్ర ముగుస్తుంది. నాలుగు రోజుల వ్యవధిలో ఏడు నియోజక వర్గాల్లో 580 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. మొత్తం 15 కుటుంబాల్ని షర్మిల పరామర్శిస్తారు.
 
 పోస్టర్ల విడుదలతో సన్నాహాలు
 తెలంగాణలో జరుగుతున్న వైఎస్ షర్మిల పరామర్శ యాత్రను విజయవంతం చేసే పనిని పార్టీ శ్రేణులు భుజాన వేసుకొన్నాయి. అనేక చోట్ల యాత్ర పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయంలో భాగస్వామ్యం వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ మేరకు పార్టీ నాయకులకు ఈ రూట్ మ్యాప్ ను పంపించారు. పర్యటన జరిగే ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకొంటూ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ముఖ్యంగా బహిరంగ సభ జరిగే ప్రాంతాల్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

 జయప్రదం చేయండి-రాష్ట్ర అద్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
 వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర సందర్భంగా హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జి. సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. యాత్ర జరిగే నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జ్‌లతో అన్ని వివరాలు చర్చించారు. ఈ యాత్రలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ప్రతీ కార్యకర్త కొంత దూరమైనా షర్మిల పరామర్శ యాత్రలో పాల్గొనాలని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, నల్లా సూర్య ప్రకాష్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, మహిపాల్ రెడ్డి, భీష్వ రవీందర్, అమృతసాగర్, సూరజ్ ఎజ్దానీ, ధనలక్ష్మి, ప్రభు కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment