4 April 2015

అన్నీ ఆర్భాటాలే

  • చంద్రబాబు తీరుపై ప్రతిపక్ష నేత జగన్ విమర్శ
  •  పీబీసీకి 1.5 లక్షల ఆయకట్టుకు 12 వేల ఎకరాలకే ఏడాదిలో ఒక తడి నీరిచ్చారు
  •  16 టీఎంసీలు అవసరమైతే.. 2.55 టీఎంసీలు ఇచ్చి గొప్పలకు పోతున్నారు
  •  ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ
కడప: ‘చేసింది గోరంత.. చెప్పేది కొండంతలా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ఇక్కడ పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు 1.52 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అందులో 12 వేల ఎకరాలకు ఏడాది కాలంలో ఒకే ఒక తడి నీరిచ్చారు. మరోవైపు పులివెందుల ప్రజల తాగునీటి ఇక్కట్లూ తీర్చట్లేదు. ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే.. ఆయన ప్రభుత్వం చాలా గొప్పగా పని చేస్తోందని పులివెందుల నుంచి రైతులు వచ్చి చంద్రబాబుకు శాలువాలు కప్పి సన్మానాలు చేశారని చెప్పుకొంటున్నారు’’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యంగ్యోక్తులు విసిరారు. చంద్రబాబువన్నీ ఆర్భాటపు మాటలేనని విమర్శించారు.


శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకుని, కమలాపురంలో ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నీటి కేటాయింపులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.


No comments:

Post a Comment