5 November 2015

ప్రభుత్వ మోసాలపై టాప్ టెన్ కామెంట్స్




పులివెందుల) రైతుల ఆత్మహత్యల్ని నివారించి, రైతుల్లో  భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 
పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్ చేసిన పవర్ ఫుల్ కామెంట్స్..
1.     పబ్లిసిటీ వస్తే తప్ప... చంద్రబాబు పెద్దగా స్పందించరు. ఇంత మంది రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా.. పట్టించుకోని చంద్రబాబు ఏదైనా పబ్లిసిటీ వస్తుందంటే.. ముందు వరుసలో ఉంటారు
2.    పులివెందుల ప్రాంతంలో రైతు ఆత్మహత్య చేసుకొని 18రోజులు గడిచాయి... పురుగుల మందు తాగి రాజశేఖరన్న చనిపోతే గవర్నమెంటోళ్లు ఈ పక్కకు తిరిగి చూడలేదంటే ఏమనాలి?’
3.    వ్యవసాయంపై చేసిన అప్పులు తీర్చే దారిలేక చాలామంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సంఘటన జరిగిన తర్వాతనైనా ఒక్క అధికారి రాడు.. ఎందుకు రావడంలేదో నాకైతే అర్థం కావడంలేదు.
4.     చనిపోయిన రైతు రైతుగా కనిపించడంలేదా.. లేక చనిపోయింది పులివెందులలో కాబట్టి వివక్ష చూపుతూ రాలేదా
5.    పేద రైతు కుటుంబాలు ఎలా బ్రతుకుతాయన్న ఆలోచన కూడా బాబుకు రాకపోవడం శోచనీయం.
6.    అనంతపురంలో 46మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లా.. అందులో 20కి పైగా ఇళ్లకు గవర్నమెంటోళ్లు పోలేదు.
7.    ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆచరణలో ఏమీ అందించడంలేదు.
8.    రూ.1.50లక్షలు అప్పులోళ్లకిచ్చి మిగిలిన రూ.3.50లక్షలు బ్యాంకులో వేస్తామంటారు.. తీరా చూస్తే అకౌంటులో మాత్రం ఏమీ ఉండదు.. ఇలా ఎంతమంది రైతు కుటుంబాలను మభ్యపెడతారు
9.    అసలు ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఎందుకు చేయలేకపోతోంది.. చనిపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదో చెప్పాలి
10.  ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి. పబ్లిసిటీ వస్తుందంటేనే పరిహారం ఇవ్వాలన్న ఆలోచనను పక్కనపెట్టి ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి పరిహారం అందించి న్యాయం చేయాలి. 

3 November 2015

ధరల పెరుగుదలకు 10 కారణాలు



ఇటీవల కొంతమంది మాట్లాడుతూ ధరలు దేశమంతా పెరుగుతున్నాయని, ఉత్పత్తి తగ్గితే ఎవరు ఏం చేస్తారని, చంద్రబాబు చేతుల్లో ఏమీ ఉండదు..కేంద్రానిదో, మరొకరిదో లోపమని ప్రచారం చేస్తున్నారు. ఒక్క కందిపప్పు విషయం తీసుకొంటే మనకు  కనికట్టు బాగా అర్థం అవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమనటంలో చంద్రబాబు పాత్ర ఇదిగో..
1.       ఆంధ్రప్రదేశ్ లో కందిపప్పు వినియోగం ఏడాదికి సుమారు 3 లక్షల టన్నులు. ఇందులో మూడో వంతు అంటే  ఒక లక్ష లేదా మరో పాతిక వేలు అదనంగా మాత్రమే మన దగ్గర పండుతోంది. అంటే అధిక భాగం దిగుమతుల మీద ఆధారపడటమే. అంటే ఉత్పత్తి విషయం పెద్దగా ప్రభావితం చూపదు
2.       ఉత్పత్తి తగ్గిందన్న మాట కాసేపు అంగీకరిద్దాం. కానీ ఈ ఏడాది ఉత్పత్తిలో తగ్గుదల 9శాతం మాత్రమే అంటే.  అలా అయితే రేటు కూడా మహా అయితే 10 లేక 15శాతం మాత్రమే పెరగాలి. కానీ రేటు 150శాతం పెరిగింది
3.       దేశంలో ఫ్యూచర్ ట్రేడింగ్ బాగా పెరగుతోంది. ఇందులో నిత్యావసర వస్తువులు అయిన కందిపప్పు, మినప పప్పు ఉండటంతో క్రత్రిమంగా ధరలు ఒక్కోసారి భగ్గుమంటున్నాయి. వీటిని తప్పించాలన్న డిమాండ్ ఉంది. కానీ ఇప్పటి దాకా చంద్రబాబు ప్రభుత్వం  ఈ మేరకు కేంద్రాన్ని కోరనూలేదు. కనీసం లేఖ కూడా రాయలేదు.
4.       మరో వైపు ధరలు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తున్నప్పుడే తక్షణ చర్యలకు ఉపక్రమించాల్సింది. కానీ చంద్రబాబు ఆ సమయంలో అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లలో బిజీగా ఉండిపోయారు. సీఎం వెంట మంత్రులు, ఆ వెంట ఉన్నతాధికారులు ఉండిపోయి ధరల్ని ఆకాశానికి వదిలేశారు.
5.       ధరలు పెరిగేటప్పుడే పౌర సరఫరాల శాఖ జోక్యం చేసుకొని ఉంటే కొంత మేర అయినా సామాన్యులకు న్యాయం దక్కేది.
 6.       జిల్లాల్లో వర్తకలు ఎవరు, నల్ల బజారుకి సరుకుల్ని తరలించేది ఎవరు అన్నది గుర్తించాలంటే అధికారులతో టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేయాలి. అక్రమ నిల్వలు దాచిన గోడౌన్ లపై దాడి చేయాలి.
 (గతంలో ఇసుక మాఫియా ను అడ్డుకొన్నందుకు వనజాక్షి అనే మహిళా రెవిన్యూ అధికారిని తెలుగుదేశం ఎమ్మెల్యే నిస్సిగ్గుగా కొట్టిస్తే చంద్రబాబు సెటిల్ మెంట్ చేయించి నోరు మూయించారు. అటువంటప్పుడు అధికారులు టీడీపీ మాఫియా ఆగడాల్ని ఎలా ఆపగలుగుతారు)
7.       నల్ల బజారు కు తరలుతున్న అక్రమ నిల్వల విషయంలో కేంద్రం రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం నిద్ర నటించింది.
8.       చౌక ధరల దుకాణాలు, రైతు బజార్లలో సబ్సిడీ రేటుకి సరఫరా చేయించే ఏర్పాట్లు ఉండాల్సి ఉండగా, సమగ్రంగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.
9.       పైగా ఇప్పుడు వర్తకుల దగ్గరే రేటును రూ. 140 (హోల్ సేల్), రూ. 143(రిటైల్) గా స్థిరీకరించి అమ్మిస్తామని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.
10.   దళారీలే రేటును 70 నుంచి రూ. 200 కి పెంచితే, వాళ్లకే అవకాశం ఇచ్చి రూ.140 దగ్గర స్థిరీకరించామని చెప్పటం ఎంత వరకు సమంజసం.
కందిపప్పు విషయంలో చంద్రబాబు బండారం బయట పడింది కదా. మిగిలిన నిత్యావసర వస్తువుల
ధరలు భగ్గుమనటానికి కూడా కారణం ముమ్మాటికీ చంద్రబాబే..!

1 November 2015

పప్పులు ధరలు పెరగటానికి కారణం




సామాన్యుల అవసరాలు చంద్రబాబుకి పెద్దగా పట్టవు. అది ఆయనకు స్వతాహాగా ఉన్న లక్షణం. అందుకే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు.
 కందిపప్పు విషయమే తీసుకొంటే ప్రభుత్వం చేతకాని తనం ఏమిటో స్పష్టంగా అర్థం అవుతుంది. కందిపప్పు ధర కిలో రూ. 200 దాటి పై పైకి ఎగబాకుతోంది. ఇందుకు డిమాండ్..సప్లయి సూత్రాన్ని ప్రభుత్వం పెద్దగా ప్రచారం చేస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పప్పుల ధరలు పెరిగాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కానీ ఇది చాలా వాస్తవ దూరం. ఎందుకంటే మన దగ్గర కంది ని సాగుచేయటం కాస్త తగ్గిన మాట వాస్తవం. సగటున ఉత్పత్తిలో ఈ సారి 9.5 శాతం మాత్రమే తగ్గింది. అంటే మహా అయితే 10, 20 శాతం మేర ధరలో పెరుగుదల రావచ్చు. కానీ ఎకాఎకిన 70,80 రూపాయిల నుంచి 200 రూపాయిలు దాటిపోయింది అంటే 150శాతంమేర పెరుగుదలను గమనించవచ్చు. ఈ స్థాయిలో పెరుగుదలకు ఉత్పత్తి తగ్గటం అన్నది కారణం కానే కాదు.
గతంలో కందిపప్పు ధరలు పెరిగిన ప్రతీ సారి ప్రభుత్వం నుంచి ఒకటే సన్నాయి నొక్కులు.. కందుల విస్తీర్ణాన్ని ప్రోత్సహిస్తామని, సబ్సిడీ ధరలకు విత్తనాలు అందిస్తామని, రైతులకు అండగా నిలుస్తామని, తద్వారా మార్కెట్ లో కందిపప్పు రేట్లు అదుపులో ఉంచుతామని. అక్కడికీ, మార్కెట్ లో రేట్లు పెరిగిపోవటానికి రైతులే కారణం అన్నట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం మాత్రమే ఇది. కందులకు కనీస మద్దతు ధరను రూ.130గా నిర్ణయించి, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వుండవల్సింది. వర్షపాతం తక్కువగా ఉంటుందనే విషయాన్ని కూడా రైతులకు తెలియజేసి వుండవల్సింది. అప్పుడు రైతులు నీటి ఎద్దడిని తట్టు కునే వంగడాలనే సాగుచేసేవారు. తత్ఫలితంగా ఈ ఏడాది పప్పు ధాన్యాల ముఖ్యంగా కందిపప్పు కొరత ఉండేది కాదు. అలాగే కందులకు కనీస మద్దతు ధరను రూ.100 నుంచి రూ.130కి పెంచి వుండవల్సింది.   ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుతం కందిపప్పు ధర అమితంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.
అవునన్నా కాదన్నా కందిపప్పు రేట్లు భయంకరంగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు మాత్రమే. కందుల ఉత్పత్తి తగ్గటాన్ని గమనించిన దళారీలు గుట్టు చప్పుడు కాకుండా నల్లబజారుకి తరలించేశారు. అటు ఫ్యూచర్ మార్కెట్ పేరుతో అందుబాటులో ఉన్న  కందులు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయాయి. దీంతో సామాన్యులకు మార్కెట్లో అందుబాటులో లేకుండా పోయాయి. ఫలితంగా కందిపప్పు రేట్లు భగ్గుమంటున్నాయి.  
ఇటువంటి సమయంలో అధికారులతో ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసి కొరడా ఝుళిపిస్తే నల్ల బజారులేని కందులు బయటకు వస్తాయి. కందిపప్పును దాచి పెట్టిన పందికొక్కుల్ని పట్టుకోవాలి. కానీ పందికొక్కులన్నీ తెలుగుదేశం తాబేదారులవి కావటంతో ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
మహిళాతహశీల్దార్ వనజాక్షి ... ఇసుక అక్రమ రవాణాను  అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే జుట్టుపట్టి తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొట్టించారు. అంతటి దాడి చేస్తే చంద్రబాబు స్వయంగా క్యాంప్ కార్యాలయంలో కూర్చొని మహిళా అధికారిని పిలిపించి బెదిరించి పంపించారు. దీంతో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన సందేశం పంపించారు. తెలుగు తమ్ముళ్లు ఎక్కడ ఎటువంటి దందా చేసినా కన్నెత్తి చూడవద్దని పరోక్షంగా ఆదేశించారు. దీంతో ఇసుక అక్రమ మాఫియా కానీ, కందిపప్పును దాచిపెడుతున్న పందికొక్కులు కానీ హాయిగా కాలం వెళ్లదీస్తున్నాయి. అందుకే నల్ల బజారు దళారీల మీద ఎటువంటి చర్యలు లేనే లేవు.
 నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే చాలా చర్యలు తీసుకోవచ్చు. మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపి పప్పుల కొనుగోళ్లు చేపట్టవచ్చు. రేషన్ డిపోలు, రైతు బజార్ల ద్వారా ధరల్ని క్రమబద్దీకరించి పప్పుల్ని అమ్ముకోవచ్చు. కంట్రోల్ ఆర్డర్లు జారీ చేసి ధరల పెరుగుదలకు కళ్లెం వేయవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అదేమీ చేయదు. ఎందుకంటే  సామాన్యుల గురించి ఆయనకు ఎప్పుడు పట్టదు.

30 October 2015

చంద్రబాబుకి ఒక చిన్న లెక్క


రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 33 వేల ఎకరాలు లాక్కొంది. అక్కడ పంటల్ని నాశనం చేసింది. అంటే దేశ ఆహార భద్రతకు పెద్ద సవాల్ విసురుతోంది.
అమరావతి ప్రాంతంలో ఒక ఎకరా తక్కువలో తక్కువ 40 బస్తాల ధాన్యం పండుతుంది. అదీ ఒక సీజన్ లో. మనం ఒక్క సీజన్ గురించే మాట్లాడుకొందాం.
అంటే 33 వేల ఎకరాల్లో 33,000 X 40 =13,20,000. అంటే 13 లక్షల 20వేల బస్తాల ధాన్యం పండుతుంది. దీన్ని బియ్యంగా మారిస్తే 75 కిలోల చొప్పున 13,20,000×75=99,000,000 కిలోల బియ్యం అన్నమాట. ఒక కిలో బియ్యం ముగ్గురికి వేసుకొన్నా కూడా 99,000,000 ×3 =19,80,00,000 అవుతుంది. అంటే 19 కోట్ల 80 లక్షల మందికి తిండి దక్కేది అన్నమాట.

ఈ విదంగా ప్రజలకు ఆహారం దక్కకుండా చంద్రబాబు ఉసురుపోసుకొంటున్నారు. అన్నపూర్ణగా పేరు తెచ్చుకొన్న రాష్ట్రానికి ఆహారపు కరవు వచ్చేట్లు చేస్తున్నారు. 

29 October 2015

చంద్రబాబే దత్తత తీసుకొన్నారు. కానీ, పరిస్థితి ఇలా మిగిలింది


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సామెతను బాగా వంట బట్టించుకొన్నారు. అందుకే ఏ సమయానికి ఆ ప్రకటన చేసేసి, ప్రచారం చేయించేసుకొని చేతులు దులుపుకొంటుంటారు.
గ్రామాల అభివ్రద్దికి ప్రతీ ఒక్కరూ  ముందుకు రావాలని, ప్రతీ ఒక్కరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రతిపాదించారు. అనటమే కాదు ఆర్బాటంగా ఆయన కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొంటున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా ఏజన్సీలోని అరకు మండలం పెదలబుడు పంచాయతీ ని ఆయన దత్తత తీసుకొన్నారు. ఈ సంగతి తెలియగానే పెదలబుడు గ్రామస్తుల ఆనందానికి అంతే లేదు.
పెదలబుడు గ్రామం రూపురేఖలు మారిపోతాయని, అభివ్రద్ది పరగులు తీస్తుందని అంతా ఆశించారు. కానీ అటువంటి అద్భుతాలు ఏమీ జరగలేదు. దత్తత తీసుకొన్నప్పుడు గ్రామం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మొత్తంగా ఇక్కడ 43 పనులు అవసరం అవుతాయని గ్రామస్తులు కలిసి ప్రతిపాదనలు తయారుచేశారు.
ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో నీటి సమస్యను తీర్చాలని విన్నవించుకొన్నారు. అదిగదిగో సురక్షిత తాగునీటి పథకం అన్నారు తప్పితే గొంతు తడిపే మార్గం లేదు. దీంతో గ్రామస్తులు ఎక్కడెక్కడ నుంచో నీరు తెచ్చుకొంటున్నారు. రహదారులు నిర్మించాలని ఎంత మొత్తుకొంటున్నా పట్టించుకొనే వారు కరవయ్యారు. ఈ గ్రామాన్ని కలిపేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. అవన్నీ గోతులు గా మారి శిథిలావస్థలో ఉన్నాయి. పసి పిల్లలకు ఆహారం సమకూర్చే అంగన్ వాడీ భవనాలు శిథిల నిర్మాణాల్లో కునారిల్లుతున్నాయి.
దత్తత ప్రకటన అయితే విడుదల అయింది తప్పితే చంద్రబాబు గత ఏడాది కాలంలో ఇటువైపు చూసిన దాఖలాలు లేనేలేవు.
ఏరియా ఆస్పత్రి సమీపంలో బస్ షెల్టర్ నిర్మాణాన్న సంకల్పించారు. కానీ దాన్ని అలాగే వదిలేశారు.

సులబ్ కాంప్లెకస్ నిర్మాణానికి ప్రతిపాదనలు పేపర్ మీదనే ఉండిపోయాయి. ముందుకు కదలలేదు
అంబేద్కర్ సామాజిక భవనం నిర్మిస్తామని హామీలు గట్టిగా గుప్పించారు. పునాది రాయి పడింది తప్పితే ఫలితం లేదు.
కళ్యాణమండపం నిర్మిస్తామని గోడల వరకు కట్టించారు. తర్వాత 
పట్టించుకోకపోవటంతో పిచ్చి మొక్కలకు ఆలవాలంగా మారింది.

మరి, రాష్ట్రమంతా తిరిగి నీతులు చెప్పే చంద్రబాబు .. తాను దత్తత తీసుకొన్న గ్రామాన్ని ఎందుకు గాలికి వదిలేసినట్లు. ఈ ప్రశ్న గ్రామస్తుల మనస్సులో మెదలుతున్నప్పటికీ పైకి మాత్రం అడగలేరు కదా.

పొట్ట వస్తోందా... ? అయితే రాకుండా చేసుకోండి ఇలా...

Welcome to YSRCP Offcial Blog

27 October 2015

మిత్ర బంధం ఏమవుతోంది



ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తో కలిసి తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రెండు పార్టీ లు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితోనే ఎన్నికల గోదాంలోకి దిగాయి. కానీ, ఎన్నికల తర్వాత కాలం నుంచి చంద్రబాబు వైఖరి మాత్రం బీజేపీని తొక్కేసేందుకు అన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నారు.

గతంలో బీజేపీ నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం పాలన జరిగినప్పుడు తెలుగుదేశం బయట నుంచి మద్దతు ఇచ్చింది. అప్పట్లో కేంద్రం నుంచి లబ్దిపొందుతూనే అదంతా తమ ఘనత మాదిరిగా ప్రచారం చేసుకొన్నారు. బీజేపీ ని రాష్ట్రంలో క్యాడర్ లేకుండా నాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అదే భయంతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తో పొత్తుకు కొందరు నాయకులు వెనుకాడారు.

ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ధోరణి కనబరుస్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల విషయానికి ఎక్కడా ప్రచారం చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజధాని నిర్మాణానికి దాదాపు 18 వందల కోట్ల రూపాయిలు కేంద్రం విడుదల చేసినా ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పెట్రో, ట్రైబల్, సెంట్రల్ యూనివర్శిటీల ఏర్పాటుకి కేంద్రం అనుమతులు ఇచ్చింది అయినా వాటికి భూములు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నాటకాలు కొనసాగిస్తోంది. కేంద్రానికి ఎక్కడ పేరు వచ్చేస్తుంది అన్న  ఉద్దేశ్యంతో హైడ్రామా కొనసాగిస్తోంది. ఉన్నత విద్య కోసం రూ. 4 వేల కోట్లు కేంద్రం  ఇచ్చింది. మరో 4 వేల కోట్ల విడుదలకు రంగం సిద్దంమైంది. అయినా సరే,  నిధుల్ని ఎక్కడ వెచ్చించింది లెక్కలు చెప్పకుండా దొంగాట ఆడుతోంది. ఒంగోలు, చిత్తూరు, తిరుపతి లలో నిమ్స్ ఏర్పాటుకి కేంద్రం అనుకూలంగా ఉన్నా ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టడం లేదు.

చంద్రబాబు వైఖరి మిత్రపక్షం బీజేపీలో అసంత్రప్తి కలిగిస్తోంది. ఒక వైపు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని దిగమింగుతూనే , మరో వైపు బీజేపీకి ఏమాత్రం మంచి పేరు రాకుండా అడ్డు పడుతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం స్పష్టంగా కనిపిస్తున్నా దాన్ని దాచిపెట్టేసి, నింద అంతా కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. బహిరంగంగా వ్యాఖ్యానిస్తే లేనిపోని సమస్యలు మొదలవుతాయని భావిస్తున్నారు. 

26 October 2015

అమరావతి గురించి బీబీసీ వార్తా కథనంలో ఏమున్నది


బీబీసీ ప్రత్యేక కథనంలో చేదు వాస్తవాలు
హైదరాబాద్: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న  విధ్వంసాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ కుండ బద్దలు కొట్టింది. కోటి చెట్లు నరికివేసేందుకు జరుగుతున్న కుట్రను బయట పెట్టింది.

అమరావతి రాజధానికి 400 కోట్లతో శంకుస్థాపన చేయించిన చంద్రబాబు..అందులో 30 కోట్లు దాకా ఖర్చు పెట్టించి ప్రాంతీయ, జాతీయ ఛానెళ్లతో బాగా ఊదించుకొన్నారు. బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేస్తున్నట్లు హడావుడి చేయించుకొన్నారు.

అంతర్జాతీయ వార్తాసంస్థ బీబీసీ మాత్రం చేదు వాస్తవాల్ని బయట పెట్టింది. కొత్త రాజధాని కోసం చంద్రబాబు చెబుతున్న కబుర్లను మొదట్లో ప్రస్తావించింది. తర్వాత అసలు వాస్తవాల్ని బయట పెట్టింది. అమరావతి పేరుతో పర్యావరణాన్ని తీవ్రంగా విధ్వంసం చేస్తున్నట్లు వెల్లడించింది. సింగపూర్ కు 10 రెట్ల మేర విస్తీర్ణంలో నగరాన్ని కట్టేందుకు తహతహ లాడుతున్నారని రిపోర్ట్ చేసింది.

కోటి చెట్లను నరికేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీబీసీ కథనంలో ఆందోళన వ్యక్తం అయంది. మూడు పంటలు పండే వేలాది ఎకరాల్లో పంట భూముల్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా తప్పు పట్టిందని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదని పేర్కొంది. 49 వేల ఎకరాలకు పైగా అటవీ భూముల్ని డీ నోటిఫై చేసేందుకు అంటే అడవుల్ని నాశన చేసేందుకు  చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని బయట పెట్టింది. ఇంతటి విధ్వంసానికి చంద్రబాబు సర్కారు కుటిల యత్నాలు చేస్తోందని వివరించింది. 

24 October 2015

చంద్రబాబు టాప్ టెన్ మోసాలు


ప్రత్యేక హోదా అన్న విషయం వెలుగు చూసిన నాటి నుంచి చంద్రబాబు అనేక సార్లు మోసాలకు పాల్పడ్డారు. ప్రతీసారి ప్రజల్ని తప్పు దారి పట్టించారు తప్పితే స్పష్టత మాత్రం ఇవ్వనేలేదు. ఈ విషయంలో చంద్రబాబు చేసిన టాప్ టెన్ మోసాలు..
1. ఎన్నికల సభలో ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలంటూ ప్రచారం. ప్రజల్ని బుట్టలో వేసుకొనేందుకు అప్పట్లో అదొక ప్రధాన అస్త్రం
2. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పరిగెత్తుకొంటూ వస్తుందని బీజేపీ నేతలతో కలిసి ప్రచారం.
3. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి లాబీయింగ్ లు, కాంట్రాక్టర్ల పనులు తప్ప ప్రత్యేక హోదా మీద మౌనం
4. అప్పటికే కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందిన హోదా గురించి ప్రణాళికా సంఘంకు చెప్పకుండా దాటవేత
5. తీరా ప్రణాళికా సంఘం రద్దు అయిపోయాక అంతా అయిపోయిందంటూ సన్నాయి నొక్కులు

6. ప్రత్యేక హోదా మీద జగన్ పోరాటంతో ప్రజల్లో చైతన్యం రావటంతో చంద్రబాబు టీమ్ గందరగోళ ప్రకటనలు
7. మంత్రులు ఒక మాదిరిగా, ఎంపీలు ఒక విధంగా, ఎమ్మెల్యేలు మరో విధంగా ప్రకటనలు చేసేట్లుగా వ్యూహం
8. ఢిల్లీలో ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ ప్యాకేజీల గురించి పలవరించిన చంద్రబాబు
9. అమరావతి వేదికగా ప్రత్యేక హోదా గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించని బాబు
10. విజయవాడ ప్రెస్ మీట్ లో మాత్రం ప్రత్యేక హోదా అనబోయి ప్యాకేజీ అన్నానంటూ సన్నాయి నొక్కులు


23 October 2015

తూచ్‌..నోరు జారానోచ్


అమరావతి శంకుస్థాపన సభలో తాను మాట్లాడేటప్పుడు.. ప్రత్యేక హోదా అనబోయి పొరపాటున ప్రత్యేక ప్యాకేజి అన్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రధానమంత్రికి చాలా స్పష్టంగా రిక్వెస్టు చేశానని అన్నారు. అన్ని విష‌యాలు చాలా  స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ప‌దే పదే స్ప‌ష్టంగా చెప్పారు.

ప్రత్యేక హోదా బదులు ప్యాకేజి ఇచ్చి సమన్యాయం చేయాలని కోరిన‌ట్లు అంత‌లోనే చెప్పుకొచ్చారు. వేదికపై పెద్దలంతా ఉన్నప్పుడు చాలా నియంత్రణతో మాట్లాడాలంటూ సూక్తులు వినిపించారు.  భావోద్వేగంతో ఒక్క మాట తప్పు మాట్లాడినా నెగెటివ్‌గా పోతుందంటూ క‌ల‌రింగు ఇచ్చారు. టెంపర్‌మెంట్‌కు భిన్నంగా ఎలా చేయాలో అలా చేశానని, ఎక్కడ చిన్న అపశృతి జరిగినా మొత్తం యజ్ఞానికే భంగం కలుగుతుందని చెప్పుకొచ్చారు. పవిత్ర కార్యక్రమంలో ఎలా బ్యాలెన్స్ చేయాలో అలా చేశానంటూ సెంటిమెంట్ జోడించారు. ప్రసంగంలో  స్పెషల్ స్టేటస్ అనబోయి స్పెషల్ ప్యాకేజి అన్నట్లు స‌ర్ది చెప్పారు. 

22 October 2015

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు



ప్రత్యేక హోదా మీద పెదవి విప్పని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తెస్తారు, ప్రత్యేక హోదా మీద ప్రకటన చేస్తారు అని  రాష్ట్ర ప్రజలంతా ఆశించారు. మోదీగారు వచ్చారు, వెళ్లారు, పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని తెచ్చారు. ఢిల్లీ పక్కన ప్రవహించే యమున నది నుంచి నీళ్లు కూడా తెచ్చారు. కానీ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అంతా కలిసి రాష్ట్రాన్ని విడగొడుతూ ఇచ్చిన మాట ను మాత్రం మరిచారు.
       ఎన్నికల వేళ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ను ఎన్నికలు అయిపోయిన తరువాత పక్కన పెట్టేశారు. ప్రధానమంత్రి నోట వస్తుందన్న ప్రకటన రాలేదు. ఈ విషయంలో ఒత్తిడి తీసుకొని రావాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కేసుల నుంచి బయటకు రావటం కోసం ప్రత్యేక హోదాను అమ్మేశారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువత, చదువుతున్న పిల్లల ఆశల మీద నీళ్లు చల్లారు. విభజన సమయంలో చట్టబద్దంగా మనకు లభించి, ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా రావలసిన అవే హామీలకు కొత్తగా పేరు మార్చి ‘ప్యాకేజీ’ అని పేరు పెట్టి అవే ఇస్తామని మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది భావ్యమేనా..?
ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ చోట నిరసనలు తెలపాల్సిందిగా, మన రాష్ట్ర ప్రజల బాధ, మనో వేదన మోదీ గారికి, బాబు గారికి అర్థం అయ్యేట్లుగా తెలియ చెప్పాల్సిందిగా ప్రతీ అక్క..చెల్లికి, ప్రతీ అన్న..తమ్ముడికి, ప్రతీ అవ్వ...తాతకు ఈ సందర్భంగా వినయ పూర్వకంగా పిలుపు ఇస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటనలో వివరించారు
ప్రత్యేక హోదా వచ్చే వరకు ఈ పోరాటాన్ని కలిసికట్టుగా సాగిద్దామని పిలుపు ఇస్తున్నట్లు వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు..

21 October 2015

దేవుడా..నీవే దిక్కు అంటున్న ప్రజలు

పడకేసిన ప్రభుత్వపరిపాలన
 () శంకుస్థాపన పేరుతోచంద్రబాబు ట్రిక్కులు
 () 3 నెలలుగా పరిపాలన పూర్తిగా గాలికి
  ()  ఒక్క సీఎమ్ వో లోనే 19వేలఫైల్సు పెండింగ్
 () మొత్తంసచివాలయుంలో రెండు లక్షలదాకా  పెండింగ్
 () అన్నివ్యవస్థలు అస్తవ్యస్తం
 
 హైదరాబాద్) 
 ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన శక్తియుక్తులు అన్నీశంకుస్థాపన వీుదే పెడుతున్నారు. దీంతో మంత్రులు, ఉన్నతాధికారుల్నిపిలిచి అన్నిపనులు పురమాయించారు. దీంతో మంత్రిత్వశాఖలన్నీశంకుస్థాపన పనుల్లో మునిగిపోయూయి.    వందల కోట్ల రూపాయిల్ర ప్రజాధనాన్నివిచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న క్రతువులో  జవాబుదారీతనం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి.  
 
 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
  ఇప్పుడు శంకుస్థాపన పేరుతో అన్నిజిల్లాల యంత్రాంగానికి పనిపెట్టారు. డిప్యూటేషన్ వీుద చాలా మంది అధికారులు, సిబ్బందిని అక్కడకు తరలించారు  ఇదంతాఒక ఎత్తయితే నెలరోజులుగా ప్రతీచోట నుంచి నీరు, మట్టి సేకరిస్తున్నామని, అఖండ జ్యోతిలను పంపిస్తున్నామని, దేవాలయాల్లో పూజలు చేయిస్తున్నామని ప్రచారం చేశారు.   
 
 అన్నీపెండింగ్
 అసలే రాష్ట్రంలో రెండున్నరలక్షల్రపభుత్వఉద్యోగాలు ఖాళీఉన్నాయి.  ఉన్న సిబ్బంది అదికారుల్నిపూర్తిగా శంకుస్థాపన  వైపుకి మరల్చారు. దీంతో ఎక్కడికక్కడ పనులన్నీ స్తంభించి పోయాయి.  ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయంలోనే  దాదాపు 19 వేలదాకా ఫైల్సు నిలిచి పోయాయి. అన్నిమంత్రుల విభాగాల్నికలుపుకొంటే సచివాలయం స్థాయిలో 2 లక్షలదాకా  ఫైల్సు పెండింగ్ లో పడ్డాయి. మరో10, 15 రోజులపాటు ప్రభుత్వ యంత్రాంగం సాధారణ విధుల్లో కుదురుకొనే అవకాశం లేదు. దీంతోఅన్నిచోట్ల సామాన్యుల సమస్యలు అలాగే నిలిచిపోయే పరిస్థితి.  
 
ప్రభుత్వం ముందున్న సవాళ్లు 
 నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్నిఅంటుతున్నాయి. కందిపప్పు, మినపపప్పు ధరలు రికార్డుల్నిబద్దలుకొడుతున్నాయి.  పప్పుదినుసులు నల్లబజారుకు తరలిపోతున్నాయి. పట్టించుకోవాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు, జాయింట కలెక్టర్ లు పూర్తిగా శంకుస్థాపన భజనలో మునిగి పోయారు. ఖరీఫ్ కు  సంబంధించి ధాన్యం ఇప్పుడిప్పుడు రైతుల చేతికి అందుతోంది. విుల్లర్లు, ట్రేడర్లను పిలిపించి సరైన మద్దతు ధర రైతుకి అందేలాచూడాల్సిన బాధ్యత ప్రభుత్వం వీుద ఉంది. అదేవీు పట్టించుకోకుండా మట్టి కుండల్నిపంపించమని అధికారుల్నిరోడ్డు వీుదకు తరివేుశారు. ఇప్పుడే ధరవరలవీుద పట్టు బిగిస్తే రైతులకు అన్యాయం జరగకుండా నివారించవచ్చు. గతంలో పొగాకు చేతికి అందే సమయానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎంత మొత్తుకొన్నా వినలేదు. పుష్కరాల్ని సినిమా స్థాయిలో జరిపించేందుకు యంత్రాంగం మొత్తాన్నిఅక్కడ వెూహరింప చేశారు. ఫలితంగా పొగాకు రైతులు ఆత్మహత్యల బాట పట్టారు. ఇప్పుడు వరిపండించే రైతులకు అదే శాపం వెంటాడబోతోంది. వైద్య ఆరోగ్యశాఖ గురించి తక్కువ మాట్లాడుకోవటం వేులు. సీజన్ మారుతున్నప్పుడు అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, వైరల్ జ్వరాలు పీడిస్తున్నాయి.   వీటిని పట్టించుకోవాల్సిన వైద్యఆరోగ్య మంత్రి పూర్తిగా చంద్రబాబు భజన శాఖ మంత్రిగా స్థిరపడి పోయారు. దీంతో ఆయన శాఖ కు పూర్తిగా అస్వస్థత చేకూరిందనే చెప్పాలి.       

20 October 2015

ఐటీ నిపుణుల సైకిల్ యాత్ర అంటూ మోసం



 హైదరాబాద్) మోసం అన్నదానికి పర్యాయపదం చంద్రబాబు. ఏ పనిలో అయినా మోసం చేసి నెగ్గుకొని రావటం, ఆయనకు తెలిసిన ట్లుగా ఇతరులకు చేత కావు. తాజాగా అమరావతి పేరుతో చేస్తున్న ప్రచారం లో కూడా మోసపు ఎత్తుగడలు ఉపయోగిస్తున్నారు.

 సైకిల్ యాత్ర పేరుతో పబ్లిసిటీ
 హైదరాబాద్, ఇతర నగరాల్లో ఐటీ నిపుణులు చంద్రబాబు కి మద్దతు పలుకుతున్నారంటూ   బాగా ప్రచారం చేసుకొన్నారు.   ఐటీ నిపుణులు చంద్రబాబు సేవల్ని బాగా ఇష్టపడ్డారని, ఆ స్ఫూర్తితో సైకిల్ యాత్ర ను సంకల్పించుకొన్నారని ప్రచారం చేశారు. హైదరాబాద్ లోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ ట్రస్టు భవన్ నుంచి  పెద్ద ఎత్తున సైకిళ్లతో బయలు దేరారు. వీరికి టీడీపీ రాష్ట్ర స్థాయి నేతలు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. చంద్రబాబు గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు.

 పచ్చ మీడియాకు పండగ
 తెలుగుదేశం ఆధ్వర్యంలో కార్యక్రమం అంటే పచ్చ మీడియాకు పండగే అని వేరే చెప్పనక్కర లేదు. అందుకే సైకిల్ ర్యాలీ ని రక రకాలుగా ఫోటోలు తీసి ప్రచురించారు. వీడియోలు తీసి ఛానెల్సు లో ప్రసారం చేశారు. ఇంటర్వ్యూలు చేసి జనం మీదకు వదిలారు. మొత్తం మీద ఐటీ నిపుణులంతా తరలి వస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు.


 ఇదీ వాస్తవం
 తీరా చూస్తే సదరు యువకులు తెలివిగా వ్యవహరించారు. టీడీపీ అగ్ర నేతలు వేసిన స్కెచ్‌ప్రకారం సైకిళ్లతో బయలు దేరి ఊరి దాటాక ఒక చోట కలుసుకొన్నారు. అక్కడ డీసీఎమ్ వ్యాన్ రప్పించుకొని అందులో వీటిని వేసుకొన్నారు. తాపీగా వెహికల్ మాట్లాడుకొని అందులోకి ఎక్కేశారు. ఊరి లో ఉన్నప్పుడు చేతులు ఊపుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన యువకులు, తర్వాత చేతులు కట్టేసుకొని హాయిగా వ్యాన్ లోకి ఎక్కేశారు.

 గతంలో కూడా ఇదే మోసం
 గతంలో ప్రక్రతి బీభత్సానికి తల్లడిల్లిపోయిన శ్రీకాకుళం మొదలు ప్రకాశం జిల్లా వరకు వరద బాధితుల్ని ఆదుకోవటానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వ చ్చింది. పెద్ద ఎత్తున మందులు, సహాయ సామగ్రి పంపిస్తున్నట్లుగా ఎల్లో మీడియలో ప్రచారం చేయించుకొన్నారు. ఏడు వ్యాన్ ల్లోకి  ఎక్కించి సామాన్లు సర్దించుకొన్నారు. సీనియర్‌నాయకులు ఫోటోలు దిగారు. వీడియోలు తీయించారు. తర్వాత అక్కడ నుంచి బయలు దేరిన వాహనాలు సిటీలో నాలుగు వీధుల్లో చక్కర్లు కొట్టాయి. తర్వాత అవి వెనుక గేటు నుంచి ఎన్టీయార్ ట్రస్టు భవన్  కు చేరిపోయాయి. టీడీపీ ఆఫీసు ముందు గేటు నుంచి బయలుదేరిన వాహనాలు.. వెనక గేటు గుండా లోపలకు వచ్చేశాయి. అక్కడ మందులు, సామగ్రి మొత్తం దించేసుకొని ఆఫీసులో సర్దేసుకొన్నారు.

 అమరావతి కుట్రలు
 ఇదంతా తెలుగుదేశం నాయకులు చేస్తున్న కుట్ర. అమరావతి పేరుతో చేస్తున్న కుట్రలు ఇదే కోవలోనివి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుంచి, మండలాల నుంచి మట్టి, జలాలు తెప్పించినట్లు కలరింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా ఈ రకంగా చే స్తున్న గాంబ్లింగ్ లో భాగమే అన్న మాట వినిపిస్తోంది. వివిధ దేవాలయాలు, న దుల నుంచి తెప్పిస్తున్న జలాలు మొదలైనవి నిజమైనవేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.




16 October 2015

చంద్రోదయం జరుగుతోంది ఇలా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేస్తున్న పాపాలు.. రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. అంతిమంగా తెలుగు ప్రజల భవిష్యత్ అంధకారంగా మారబోతోంది.
అమరావతి శంకుస్థాపన పేరుతో చేస్తున్న పనులు పూర్తిగా విమర్శల పాలవుతోంది. ముఖ్యాంశాలు..
1. శంకుస్థాపన అంటే ఒక లాంఛనపూర్వక తంతు. దీనికి దేశ విదేశాల నుంచి అతిథుల్ని పిలిచి హంగామా చేయటం అంటే అసలు తక్కువ, ఆర్భాటం ఎక్కువ అనిపించక మానదు.
2. ఒక్క రోజు ఘట్టానికి మొత్తంగా రూ. 400 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు అంటే ప్రజా ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో తెలుస్తుంది.
3. రెండు నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇదే పనిలో ఉంది. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి మరీ ఈ తతాంగాన్ని నడిపిస్తున్నారు.
4. పోలీసు యంత్రాంగం లో సగభాగం దాకా ఇప్పుడు అమరావతి ప్రాంతంలోనే నిమగ్నమై ఉంది.
5. వ్యవసాయ కూలీలకు నైపుణ్యాలు కల్పిస్తామన్నారు, అన్ని విధాలా ఆదుకొంటామన్నారు కానీ ఎక్కడ కూలీల ప్రస్తావన లేదు.
6. రైతుల దగ్గర నుంచి పచ్చటి పంట పొలాల్ని తీసుకొని, భూమిపై వాళ్ల హక్కుల్ని లాగేసుకొని విదేశీ సంస్థలకు కట్టబెడుతున్నారు. అంటే పరాయి పాలనకు పరోక్షంగా ఊతం ఇవ్వటమే
7. విదేశీ సంస్థలు అంత ఉచితంగా ప్రేమగా దీన్ని నిర్మిస్తాయని ఎలా చెప్పగలుగుతున్నారు.
8. సింగపూర్ సంస్థలు ఎంత కాలంపాటు, ఎక్కడెక్కడ ఫీజులు వసూలు చేసుకొంటాయనే దానిపై స్పష్టత లేదు.
9. పారదర్శకంగా టెండర్ల విధానానికి పాతర వేసి స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ఎందుకు ఎంపిక చేస్తున్నారు.
10. ఖజానా ఖాళీ అయిపోయినా అధిక వడ్డీలకు అప్పు తెచ్చి మరీ ఆర్భాటంగా శంకుస్థాపన ఎందుకు చేస్తున్నారు. 


15 October 2015

పట్టుమని పది ప్రశ్నలకు జవాబులు దొరకుతాయా..!



హైదరాబాద్) ప్రతిపక్ష నాయకుడు గా వైఎస్ జగన్ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పిదాల్ని స్పష్టంగా బయట పెడుతున్నారు. రాజధాని పేరుతో ఆయన చేస్తున్న రాజకీయాల్ని బయట పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూటి ప్రశ్నలు గుప్పించారు.

1.       రైతుల మెడ మీద కత్తి పెట్టి లాక్కొంటున్న భూముల్ని ప్రైవేటు సంస్థలకు అందునా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టటం న్యాయమా
2.       రాజదాని లో సెక్షన్ 30, 144లు ఎందుకు అమలు చేస్తున్నారు.
3.       గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును ఎందుకు అమలు చేయటం లేదు
4.       అసైన్డ్ భూముల్ని మీ అత్తగారి సొమ్ములు అనుకొంటున్నారా
5.       మీ కమీషన్ల కోసం లంచాల కోసం ప్రజల కడుపు కొడతారా

6.       కేంద్రం ఇచ్చిన రూ. 1,850 కోట్లను ఏ చేసినట్లు
7.       కేంద్రం కట్టిస్తామన్నా వినకుండా సింగపూర్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నట్లు
8.       మీ బినామీలతో రాజధాని చుట్టూ వందల ఎకరాలు కొనుక్కోలేదా
9.       ప్రజల సొమ్ము ఒక్క రోజు కోసం రూ. 400 కోట్లు బూడిద పాలు చేస్తారా
10.   విదేశీ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయిలు దోచిపెట్టడం కాదా

ఈ ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర జవాబు లేదు. అందుకే రాజధాని శంకుస్థాపనకు రాదలచుకోలేదని సూటిగా చెప్పారు. కానీ, రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. 

14 October 2015

శంకుస్థాపన సరే, హామీల సంగతి ఏమిటి.


గుంటూరు) అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం చంద్రబాబు ప్రభుత్వం బోలెడు హడావుడి చేస్తోంది. దాదాపు 4వందల కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నాయకుల ముందు తన దర్జాను ప్రదర్శించుకొనేందుకు ప్రజల సొమ్మును ఇలా రాళ్ల పాలు చేస్తున్నారు. కానీ, రాజధాని పేరుతో సర్వం కోల్పోతున్న స్థానికులది మాత్రం అరణ్య రోదనే అవుతోంది.

రాజధాని ప్రాంత వాసులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు..
1. డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ.. అదిగదిగో అని ఊరించటం తప్ప డ్వాక్రా మహిళలకు ఏమాత్రం రుణమాఫీ చేయలేదు.

2. అన్నార్తుల కోసం ఎన్ టీ ఆర్ అన్న క్యాంటీన్ లు ఏర్పాటు.. ఆర్భాటంగా ప్రకటించారు తప్పితే ఒక్కటంటే ఒక్క క్యాంటీన్ ఏర్పాటు కాలేదు.

3. నిర్మాణ పనుల్లో స్థానికులకే ప్రాధాన్యం.. ఇంజనీర్లు, సూపర్ వైజర్ల  మాట దేవుడెరుగు, కూలీలను కూడా స్థానికుల్ని ఉఫయోగించలేదు. తాజాగా జరిగిన కరకట్ట పనుల్ని ఇతర ప్రాంతాల కూలీలతో చేయించారు. 

4. అభాగ్యులైన వ్రద్దుల కోసం వ్రద్దాశ్రమాలు నిర్మిస్తామన్నారు కానీ ఒక్క ఊర్లో కూడా ఆశ్రమం పెట్టలేదు.

5. నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. రాజధాని ప్రాంతాన్ని శాంపిల్ గా తీసుకొని యుద్ద ప్రాతిపదికన చేయిస్తామన్నారు. కానీ అడ్డగోలుగా గాలికి వదిలేశారు.
6.  వ్యవసాయం పనులు లేక ఉపాధి కోల్పోయేవారికి  నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదు ఇప్పించి ఉపాధి కల్పిస్తామన్నారు. 20వేలకు పైగా  అర్హులు ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం 2వందల మందికి కూడా పూర్తిగా ఉపాధి కల్పించలేకపోయింది.
7. నిర్మాణాలను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, మొత్తం రెవిన్యూ రికార్డుల్ని ఫ్రీజ్ చేసి ఉంచారు. దీంతో బడుగు జీవులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.
8. బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వకుండా రోజులు గడిపేశారు.
9. గ్రామ కంఠాల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. నెలలు గడుస్తున్నా వీటి ఊసు ఎత్తటం లేదు.
10. ఇవన్నీ అడగకుండా ఉండేందుకు రైతులకు పంచె కండువా ఇచ్చి నోళ్లు మూయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

13 October 2015

ఇక ముందు అలాగే ఉంటాం


హైదరాబాద్) ఒక విషయానికి కట్టుబడితే దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లటం మంచి పరిణామం. ఇప్పడు అటువంటి విషయాల మీద అందరి ద్రష్టి ఉంటుంది.




ఆంధ్రప్రదేశ్‑కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుందని నిర్దారించారు. బుధవారం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకూ నిరసన మార్చ్ జరుగుతుందన్నారు. ఈ నిరసన మార్చ్‑లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొంటారు. దీంతో పాటు వచ్చే పది రోజులకు కార్యాచరణ రూపొందించుకొన్నారు. 


*ఈనెల 17 నుంచి 21 వరకూ అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు

* 18న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు

*19న నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు

*20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ

*21న బస్సు డిపోల ముందు ధర్నాలు

ఇంతకీ అడ్డు తగులుతున్నది ఎవరంటే


  చంద్రబాబు నాయుడు పరిపాలనతో ప్రత్యేక హోదా కు ఆయనే అడ్డంకిగా నిలుస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ సంగతి అర్థం చేసుకొనేందుకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఎలా ఏర్పడుతోంది అనే విషయాన్ని గమనించాలి.

దేశంలోని రాష్ట్రాలన్నీ ఒకే తీరుగా అభివ్రద్ది చెందలేవు. ప్రగతి కి సమాన అవకాశాలు ఇవ్వాలంటే అందుకు వెనుకబాటుతనంతో లేక సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రాల్ని ప్రోత్సహించాలి. ఇందుకోసం కేంద్రం పెద్ద మనస్సుతో సాయం చేయాలి. ఈ విదంగా ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇవ్వటం మొదలైంది. ఈశాన్య రాష్ట్రాల వెనుకబాటు తనం చూసి, తర్వాత హిమాలయ రాష్ట్రాల వెనుకబాటు తనం చూసి ఈ హోదా ఇవ్వటం మొదలెట్టారు. 

రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ ను కోల్పోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోంది కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అలనాటు పార్లమెంటులో ఏకాభి్ప్రాయం కుదిరింది. అంతవరకు బాగానే ఉంది కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హంగులు ఆర్బాటాలు కోటలు దాటాయి. ప్రమాణ స్వీకారం చేసిన తీరు కానీ, తర్వాత పుష్కరాలకు ప్రచారం చేసిన విదానం కానీ జల్సాల వైభోగాన్ని చాటి చెప్పాయి. ఇక, ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు, ఆయన కోటరీ చేస్తున్న విదేశీపర్యటనలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ ఒక ఎత్తయితే రాజదాని శంకుస్థాపన పేరుతో 4,5 వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టేందుకు పూనుకోవటం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.

ఒక వైపు ఈ విధంగా అప్పు చేసి పప్పుకూడు చేస్తున్న చంద్రబాబు.. ప్రత్యేకహోదా కోసం చిత్త శుద్దితో ప్రయత్నించటం లేదు. పైగా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్న తీరుతో కేంద్రం ఆర్తిక శాఖ అధికారుల్ని పిలిచి తలంటుపోసింది. దీంతో ప్రత్యేక హోదా రావాలంటే ఉండాల్సిన కనీస అవసరాల్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం పాటించటం లేదని తెలుస్తోంది. 


12 October 2015

రిపోర్టులు మార్చటం ఎలా


గుంటూరుః రాష్ట్ర ప్రజానీకమంతా ఛీదరించుకుంటున్నా చంద్రబాబు అండ్ కో బుద్ధిమారడం లేదు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్  పోరాటాలపై చంద్రబాబు కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా హెల్త్ రిపోర్ట్ ల ట్యాంపరింగ్ కుట్ర ను వైఎస్ జగన్ స్వయంగా బట్ట బయలు చేశారు.

ప్రతీ రోజూ ప్రభుత్వ డాక్టర్లు తెస్తున్న గ్లూకో మీటర్ ఒక్కో మాదిరి రీడింగ్ ఇస్తోంది. దీంతో ఆదివారం రాత్రి వైఎస్ జగన్ ఒక కొత్త గ్లూకో మీటర్ తెప్పించి పెట్టారు. మొదటగా ప్రభుత్వ డాక్టర్లు తెచ్చిన దొంగ గ్లూకో మీటర్ తో రీడింగ్ 88 గా చూపించింది. అప్పుడు సీల్డ్ కవర్ లో ఉన్న గ్లూకో మీటర్ బయటకు తెరిచి చూస్తే 77 గా నమోదైంది. దీంతో అందరి ముందు ప్రభుత్వం చేస్తున్నకుట్రలు బట్ట బయలు అయ్యాయి. పైగా శ్యాంపిల్స్ ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్లి అక్కడ మరో సారి ట్యాంపర్ చేస్తున్నారు. కీటోన్స్ వివరాల మీద కూడా రక రకాల రిపోర్టులు బయట పెడుతున్నారు. దీని మీద కూడా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

10 October 2015

ఆంధ్రప్రదేశ్ లో ఒక నిశ్శబ్ద విప్లవం...!


గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నలు చెరగులా ఒక నిశ్శబ్ద విప్లవానికి తెర లేస్తోంది.
మొదట్లో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రజా పోరాటం అనుకొన్నారు. కానీ, చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా అన్నది ఒక సంజీవని, దాని కోసం వైఎస్సార్సీపీ మాత్రమే పోరాడుతోంది అన్న విషయం ప్రజలకు అర్థం అవుతూ వస్తోంది. దీంతో  ప్రజల్లో చైతన్యం వస్తోంది. ముఖ్యంగా హోదా అన్నది కేంద్రం ఇచ్చే భిక్ష కాదని, అది మన హక్కు అని తెలిసినా చంద్రబాబు వ్యక్తిగత స్వార్థం కోసం మభ్య పెడుతున్న తీరు అందరికీ తెలిసి వస్తోంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నలు చెరగులా రిలే నిరాహార దీక్షలు, ఊరేగింపులు ఊపందుకొన్నాయి. జనం కోసం జన నేత చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే వామపక్ష పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్వయంగా దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అటు సీపీఐ కార్యదర్శి రామక్రష్ణ దీక్ష విషయంలో చంద్రబాబు నిర్వాకాన్ని ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్ అగ్రనేత మంద క్రష్ణ స్వయంగా దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఇటు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ముఖ్యంగా యువజన సంఘాలు స్వచ్చందంగా వచ్చి జగన్ దీక్షకు సంఘీభావం చెబుతున్నాయి. 

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న పోరాటం అప్పటి తరం వాళ్లకు గుర్తుకొని వస్తోంది. అందుకే ప్రజల తరపున జరగుతున్న ఈ పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు వ్యక్తం అవుతోంది.

7 October 2015

చంద్రబాబు పాలన ఏమిటో మూడు ముక్కల్లో చెప్పగలరా.. ఓపెన్ ఆఫర్



గుంటూరు ) ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్ సందర్భంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. చంద్రబాబు పాలన తీరుని మూడు ముక్కల్లో చెప్పాలని ఆపర్ ప్రకటించారు. మోసం .. మోసం.. మోసం అన్న విధంగా సాగుతోందని ఆయన అన్నారు. దీనికి తోడు వెన్నుపోటు కూడా ఉంటుందని సభికులు పెద్ద ఎత్తున అనటంతో ఆయన చిరునవ్వుతో దాన్ని కూడా జోడించారు.
గుంటూరు  నల్లపాడు రోడ్డులో ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈసందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని కడిగి పారేశారు. తన దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అశేషజనవాహినినుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ప్రత్యేకహోదాను సాధించేవరకు విశ్రమించబోమని ప్రభుత్వాలను హెచ్చరించారు. 

చంద్రబాబు ఎన్నికలప్పుడు ఓమాట, ఎన్నికలయి పోయాక మరో మాట చెబుతూ ప్లేయి ఫిరాయించారని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు, పదిసంవత్సరాలు కావాలని ఎన్నికల సమయంలో ప్రతివీధిలో, మీటింగ్ లలో, టీవీల్లో చెప్పిన చంద్రబాబు...ఇప్పుడు తన కేసుల నుంచి బయటపడేందుకు మోడీ వద్ద సాగిలపడి హోదాను తాకట్టు పెట్టారని విరుచుకుపడ్డారు.


చంద్రబాబు పాలనంతా అవినీతి, అబద్ధాలు, మోసాలు,వెన్నుపోటులేనని వైఎస్ జగన్ అన్నారు. పట్టిసీమ నుంచి ఇసుక వరకు, బొగ్గు నుంచి మట్టివరకు కమీషన్ల రూపంలో లంచాలు పిండుకొని ...విచ్చలవిడిగా వచ్చిన సొమ్మును ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెదజల్లి అడ్డంగా దొరికిపోయారని దుయ్యబట్టారు